లాభపడ్డ తరుణ్ భాస్కర్.. రిస్క్ చేసి సక్సెస్

by Pulgam srinivas |

గాయపడ్డ సింహం టీమ్ రిస్క్ ఫలించింది… పెద్ది వాయిదాతో లక్కీ ఛాన్స్

లాభపడ్డ తరుణ్ భాస్కర్.. రిస్క్ చేసి సక్సెస్
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్కడైనా రిస్క్ చేస్తే కొన్నిసార్లు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందుతున్న ‘గాయపడ్డ సింహం’ మూవీ యూనిట్ కూడా ఓ పెద్ద రిస్క్ చేసి ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంది. అది ఏ విషయంలో అనుకుంటున్నారా? ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం తమ చిత్రాన్ని మే 1వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దాంతో ఆ తేదీ సమీపంలో మరే ఇతర చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించడానికి ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ‘పెద్ది’ లాంటి భారీ చిత్రంతో పోటీ ప్రమాదకరమేనని తెలిసినా, ‘గాయపడ్డ సింహం’ చిత్ర బృందం మాత్రం అదే తేదీన తమ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకుని ధైర్యంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక తాజాగా ‘పెద్ది’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దీంతో తరుణ్ భాస్కర్‌కు ఇది పెద్ద లక్కీ ఛాన్స్‌గా మారింది. రిస్క్ చేసి విడుదల తేదీ ప్రకటించిన ఈ టీమ్‌కు ఇప్పుడు పెద్దగా పోటీ లేకుండా మంచి రిలీజ్ డేట్ దొరికినట్లైంది. ఇక సినిమాకు మంచి టాక్ వస్తే భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్ & జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

Next Story