- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇలాంటి యుద్ధాన్ని మీరు ఎప్పుడూ చూసుండరు’.. వార్-2 పై తారక్ -కియారా అద్వానీ పోస్ట్
వార్ 2 సినిమా అప్‌డేట్‌ల కోసం జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వార్ 2 సినిమా అప్‌డేట్‌ల కోసం జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ఆగస్టు 14, 2025 థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా బాలీవుడ్‌లో చాలా అంచనాలున్న సినిమాల్లో ఒకటిగా మారింది. అంతేకాకుండా YRF స్పై యూనివర్స్‌లో ఆరవ భాగం కూడా. అయితే తాజాగా కౌంట్‌డౌన్ ప్రారంభమైందని నటి కియారా అద్వానీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులు పెట్టారు.
‘‘50Daysto వార్౨ కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదల’ అంటూ హీరోయిన్ కియారా అద్వానీ రాసుకురాగా.. ‘ ఇలాంటి యుద్ధాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరని అనుకోండి. లెక్కపెట్టుకుందాం #50DaysToWar2 … ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్లలో హిందీ, తెలుగు & తమిళ భాషలలో విడుదలవుతోంది’’ అని తారక్ క్యాప్షన్ జోడించారు. అలాగే @hrithikroshan @kiaraaliaadvani, @ayan_mukerji, #YRFSpyUniverse @yrf పేర్లను ఎన్టీఆర్ జోడించాడు. ఈ పోస్టులు వీక్షించిన నెటిజన్లు ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






