- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత ఇంట్లోనే వేధింపులు.. ఆధారాలతో సహా వీడియో రిలీజ్ చేసిన హీరోయిన్..
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియోను పంచుకుంది. 2018లో నటుడు నానా పటేకర్‌తో సహా ఇతరులపై #MeToo ఆరోపణలు చేసిన తర్వాత.. తన జీవితంలో నిరంతరం వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. సొంత ఇంట్లోనే టార్చర్ అనుభవిస్తున్నానని

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియోను పంచుకుంది. 2018లో నటుడు నానా పటేకర్‌తో సహా ఇతరులపై #MeToo ఆరోపణలు చేసిన తర్వాత.. తన జీవితంలో నిరంతరం వేధింపులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. సొంత ఇంట్లోనే టార్చర్ అనుభవిస్తున్నానని బాధపడింది. గట్టి గట్టి శబ్దాలు, తలుపులపై కొట్టడం ప్లాంటెడ్ మెయిడ్స్ చేత దొంగతనం వంటి సమస్యలు భరించలేకపోతున్నానని తెలిపింది. దీనివల్ల సహాయకులను నియమించలేకపోయానని, ఇంటిని మేనేజ్ చేయలేకపోయానని చెప్పింది. ఈ దీర్ఘకాలిక ఒత్తిడి ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపిందని.. దీనివల్ల క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ వచ్చిందని.. ఆరోగ్యం, పని చేయగల సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇంటిపై దాడులకు సంబంధించిన విషయంపై పోలీసులను సంప్రదించానన్న ఆమె.. మరో వీడియోలో దాదాపు రోజూ విచిత్రమైన గంటలలో జరిగే శబ్దాలకు సంబంధించిన ఆధారాలను పంచుకుంది. బిల్డింగ్ మేనేజ్‌మెంట్ ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని పేర్కొంది. ఆమె ఆరోపణలు అభిమానులు, నెటిజన్లలో ఆందోళన కలిగించాయి. ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్న వారు.. అధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు.






