నటికి రూ.1.65 కోట్లు ఆఫర్ చేసిన బిగ్ బాస్.. కానీ మగాడితో ఒకే బెడ్‌పై పడుకోవాలని..

by Sujitha Rachapalli |

పాపులర్ హీరోయిన్ తనుశ్రీ దత్తా.. మీటూ మూమెంట్‌తో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారింది. అప్పటి నుంచే కెరీర్ కూడా స్లో అయిపోగా.. వివాదాస్పద ఘటనలతో హెడ్ లైన్స్ టచ్ చేస్తూనే ఉంటుంది.

నటికి రూ.1.65 కోట్లు ఆఫర్ చేసిన బిగ్ బాస్.. కానీ మగాడితో ఒకే బెడ్‌పై పడుకోవాలని..
X

దిశ, వెబ్ డెస్క్ : పాపులర్ హీరోయిన్ తనుశ్రీ దత్తా.. మీటూ మూమెంట్‌తో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారింది. అప్పటి నుంచే కెరీర్ కూడా స్లో అయిపోగా.. వివాదాస్పద ఘటనలతో హెడ్ లైన్స్ టచ్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య తన ఇంట్లోనే తనకు రక్షణ లేకుండా పోయిందని.. బయటవాళ్లు వచ్చి బెదిరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేసిన ఆమె.. తాజాగా బిగ్ బాస్ షో గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ ఆఫర్ పదకొండేళ్లుగా వస్తుందని.. దాదాపు రూ.1.65 కోట్లు ఆఫర్ చేశారని చెప్పింది. కానీ తాను అంత చీప్ కాదని తిరస్కరించానని తెలిపింది. ఆ రియాలిటీ షోలో ఒకే బెడ్‌పై ఆడ, మగ కలిసి పడుకుంటారని.. ఒక్క మంచంపై పరాయి వ్యక్తితో పడుకునే చీప్ మెంటాలిటీ తనది కాదని చెప్పింది. పర్సనల్ స్పేస్ కోసం ఫ్యామిలీతోనే కలిసి ఉండని తాను.. అలా పరాయివాళ్లతో గొడవ పడుకుంటూ ఎలా ఉంటానని చెప్పుకొచ్చింది భామ.

Next Story