SSMB29లో తమిళ స్టార్ హీరో.. ఇది కచ్చితంగా మల్టీ స్టారర్ మూవీనే అంటున్న ఫ్యాన్స్!

by Chukka Sudharani |   (  Updated:2025-05-15 14:40:11  IST  )

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం SSMB29తో బిజీగా ఉన్నాడు.

SSMB29లో తమిళ స్టార్ హీరో.. ఇది కచ్చితంగా మల్టీ స్టారర్ మూవీనే అంటున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం SSMB29తో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ హై బడ్జెట్ మూవీలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ రానప్పటికీ అనౌన్స్‌మెంట్‌తోనే హైప్ పెంచేశారు చిత్ర బృందం. అలాగే SSMB29కు సంబంధించిన నిత్యం ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తుంది.

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తోంది. రాజమౌళి, మహేశ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో ఎంతో మంచి స్టార్ హీరోస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని ఇప్పటికే పలు వార్తలు రాగా.. ఇప్పుడు ఇందులో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyan Vikram) కూడా భాగం అయినట్లు తెలుస్తుంది. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇది మల్టీస్టారర్ చిత్రంలా ఉంటుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Click For Tweet..

Next Story