ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో తమిళ స్టార్ నటుడు.. వైరల్‌గా పోస్ట్

by Chukka Sudharani |

తమిళం, మలయాళం, అండ్ దక్షిణ భారత భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తు ప్రముఖ సపోర్టింగ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు గురు సోమసుందరం.

ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో తమిళ స్టార్ నటుడు.. వైరల్‌గా పోస్ట్
X

దిశ, సినిమా: తమిళం, మలయాళం, అండ్ దక్షిణ భారత భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తు ప్రముఖ సపోర్టింగ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు గురు సోమసుందరం.. ప్రస్తుతం ‘డిమాంటి కాలనీ 3’ వంటి చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన ఇప్పుడు డ్రాగన్‌లో కూడా భాగం అయ్యాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చెయ్యగా.. నెట్టింట సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా తమిళ నటుడు గురు సోమసుందరం ఇందులో రావు పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ రివీల్ చేశారు. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందుమూరి కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. జూన్ 11న పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.

Next Story