- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Atlee: రాజమౌళికి పోటీగా తమిళ డైరెక్టర్.. ప్రేక్షకుల కళ్లన్నీ అతనిపైనే..
‘రాజా రాణి’ సినిమాతో తమిళం (Tamil)లోనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ డైరెక్టర్ అట్లీ.

దిశ, సినిమా: ‘రాజా రాణి’ సినిమాతో తమిళం (Tamil)లోనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ డైరెక్టర్ అట్లీ (Tamil director Atlee). తర్వాత వచ్చిన ‘థెరి, మెర్సిల్, బిగిల్’ వంటి చిత్రాలతో మరింత క్రేజ్ పెంచుకున్న ఈ డైరెక్టర్.. షారుఖ్ ఖాన్ (Sharukh Khan) ‘జావాన్’ (Jawan)తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 12 వందల కోట్లు రాబట్టడంతో.. అట్లీ పేరు నేషనల్ లెవల్ (National Level)లో మార్మోగుతోంది. దీంతో ప్రేక్షకుల దృష్టి మొత్తం అట్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మళ్లింది.
ఈ క్రమంలోనే ఇటీవల అట్లీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ (Next Project) అవుట్ ఆఫ్ ది వరల్డ్ (Out of the World) అని అనౌన్స్ చేసేశాడు. దీంతో ఆడియన్స్ (Audience)లో క్యూరియాసిటీ (curiosity) మరింత పెరిగిపోయింది. ఇందులో భాగంగా.. అట్లికి సంబంధించి లేటెస్ట్‌గా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అట్లీ అనౌన్స్ చేసిన 6వ ప్రాజెక్ట్ రాజమౌళి (Rajamouli) సినిమాకు సవాల్ విసిరేలా వస్తుందంటూ ప్రజెంట్ ఓ న్యూస్ హాట్ టాపిక్ (hot topic)గా వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. ఈ మూవీ కోసం టెక్నీషియన్లను హాలీవుడ్ నుంచి తీసుకువస్తున్నారట. అలాగే రాజమౌళి సినిమా కంటే ముందే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అట్లీ ఆతృతగా ఉన్నారట. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఇన్నాళ్లకి రాజమౌళికి సరితూగే డైరెక్టర్ దిగిపోయాడంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.






