- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DNA: తమిళ బ్లాక్ బస్టర్ సినిమా తెలుగులోకి.. రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మధ్య కాలంలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఇటీవల తమిళంలో విడుదలై సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది ‘డిఎన్ఏ’ (DNA) సినిమా. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎస్. కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ (My baby) పేరుతో జూలై 11న విడుదల కానుంది. అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ డ్రామాకు నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జూన్ 20న తమిళంలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాస్పిటల్స్‌లో పిల్లల్ని మాయం చెయ్యడం వారిని వేరే చోట అమ్మేయడం వంటి వార్తలని నిత్యం ఏదో ఒక చోట వింటూనే ఉంటాం. ఈ సినిమా మరొక్కసారి మనం సొసైటీలో ఎంత జగ్రత్తగా ఉండాలో తెలియచేసింది. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.






