- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా 158లోకి తమన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్!
మెగా 158 మూవీకి తమన్ సంగీతం అందించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబి కొల్లి తెరకెక్కించనున్న కొత్త సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయకపోవడంతో, ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను మే 21వ తేదీన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ పనిచేయనున్నాడనే వార్తలు వినిపించగా, తాజాగా ఈ చిత్ర బృందం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘మెగా 158’ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందించనున్నట్లు వెల్లడించింది. గతంలో పలు ఇంటర్వ్యూలలో తమన్, చిరంజీవి కమర్షియల్ చిత్రాలకు సంగీతం అందించే అవకాశం ఇప్పటివరకు తనకు రాలేదని, అలాంటి అవకాశం వస్తే తన సామర్థ్యం ఏంటో చూపిస్తానని పేర్కొన్నాడు. దీంతో ‘మెగా 158’ చిత్ర సంగీతంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు - బాబి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






