- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Odela 2 Teaser : కుంభమేళాలో తమన్నా " ఓదెల 2 " మూవీ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
ఓదెల రైల్వే స్టేషన్ కి ( Odela Railway Station ) ఇది సీక్వెల్ గా తెరకెక్కింది.

దిశ, వెబ్ డెస్క్ : " ఓదెల రైల్వే స్టేషన్ " ( Odela Railway Station ) మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనందరికి తెలిసిందే. ఈ చిత్రం 2022 ఆగస్ట్ 26 న ఆహాలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో " ఓదెల 2 " కూడా మూవీ ఒకటి. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడమే కాకుండా ఈ మూవీకి నిర్మాతగా కూడా ఉన్నారు. అకోశ్ తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ కరోనా సమయంలో పార్ట్ 1మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న " ఓదెల 2 " ( Odela 2) మన ముందుకు రానుంది.
ఓదెల రైల్వే స్టేషన్ కి ( Odela Railway Station ) ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మేకింగ్ పరంగా చూసుకుంటే తొలి సినిమాకూ, సీక్వెల్‌కూ చాలా తేడా ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను మహాకుంభ మేళాలో రిలీజ్ చేశారు. టీజర్‌లో తమన్నా నాగ సాధువుగా కనిపించింది. ప్రస్తుతం, ఈ టీజర్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
అలాగే, వీఎఫ్ఎక్స్ షాట్స్ అయితే 'వావ్' అనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే శివుడి పాట అద్భుతంగ ఉంది. టీజర్లో " నీరు, నిప్పు, గాలి, ఆకాశం , భూమి అన్ని నా రూపానికే దాసోహమే " అన్న డైలాగ్ అందర్ని ఆకట్టుకుంటోంది. హెబ్బా పటేల్ , మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. వశిష్ట సింహా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఎలా కాపాడారు? అనేది కథ. త్వరలో మన ముందుకు రాబోతున్న " ఓదెల 2 " హిట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.






