- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tamannaah: సూపర్ ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోయిన్లకు షాక్ ఇస్తున్న మిల్కీ బ్యూటీ
సూపర్ ఫిట్‌నెస్‌తో మెస్మరైజ్ చేస్తున్న తమన్నా.

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో విడుదలైన ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ద్వారా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
అనంతరం ‘హ్యాపీ డేస్’ సినిమాలో హీరోయిన్‌గా నటించగా ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా తమన్నా క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం, అందులో చాలా సినిమాలు విజయాలు సాధించడంతో తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు కొంత తగ్గినా, మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తన అందాలతో వెండితెరపై మెప్పించిన మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలోనూ గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.
తాజాగా రెడ్ డ్రెస్‌లో సోఫాపై కూర్చొని, పడుకొని, స్టైలిష్ లుక్‌లో డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఈ ఫోటోల్లో తమన్నా మెడలో స్టోన్స్‌తో డిజైన్ చేసిన హారం ధరించగా, దానికి సరిపోయే ఉంగరం ఆమె లుక్‌ను మరింత హైలైట్ చేశాయి.
మొత్తంగా ఈ స్టైలిష్ ఫోటోల్లో తమన్నా సూపర్ లుక్‌లో కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న సూపర్ ఫిట్ మరియు గ్లామరస్ గా ఉంటూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది.
Photos Courtesy: Instagram






