- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamannah Bhatia: ఒక్క పోస్ట్‌తో నిజాలు బయటపెట్టిన తమన్నా.. షాకింగ్ వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) ‘హ్యాపీడేస్’ సినిమాతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) ‘హ్యాపీడేస్’ సినిమాతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు(Mahesh Babu), ఎన్టీఆర్, వెంకటేష్(Venkatesh), చిరంజీవి, ప్రభాస్(Prabhas) వంటి వారితో నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే పలు తమిళ చిత్రాల్లోనూ నటించిన ఈ భామ మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా మారిన తమన్నా భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆడి పాడి తన డ్యాన్స్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల ‘సికందర్’(Sikander) సినిమాతో వచ్చిన తమన్నా విజయం సాధించలేకపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఓదెల-2’(Odela-2) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్స్‌లోకి రానుంది. ఇక తమన్నా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె గత కొద్ది రోజుల నుంచి నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడగా.. అది కాస్త ప్రేమగా మారింది. ఇక ఈ జంట పలు ఈవెంట్స్‌కు కూడా హాజరయ్యారు. దీంతో త్వరలో విజయ్, తమన్నా పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. ఈ నేపథ్యంలో.. ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకుని విడిపోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీనిపై వీరిద్దరు అధికారిక ప్రకటన చేయనప్పటికీ పలు కామెంట్స్‌తో క్లారిటీ ఇచ్చారు. ఇక వీరి బ్రేకప్‌పై ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ కొంతమంది అవన్నీ పుకార్లే అని అంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, తమన్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆమె ఇంట్లో ఓ పూజ నిర్వహించింది. అయితే ఇందులో తన కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు కూడా పాల్గొన్నారు. కానీ విజయ్ వర్మ మాత్రం ఎక్కడా కనిపించలేదు. బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయింది కాబట్టే అతడిని పిలవలేదని అంతా చర్చించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటుందనుకుంటే.. ఇలా షాకిచ్చిందేంటని అంటున్నారు. ఇక ఒక్క పోస్ట్‌తో నిజాలు బయటపెట్టిందని అభిప్రాయపడుతున్నారు.






