పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా.. అతనితో బ్రేకప్ అవ్వడం వల్లే ఇంత పెద్ద డెసిషన్ తీసుకుందా..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-22 09:30:19  IST  )

మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా.. అతనితో బ్రేకప్ అవ్వడం వల్లే ఇంత పెద్ద డెసిషన్ తీసుకుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘ఓదెల-2’(Odela-2) సినిమాతో మన ముందుకు వచ్చి మెప్పించింది. ఇది సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’(Railway Station)కు సీక్వెల్‌గా వచ్చింది. అలాగే మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో మొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో ఉంటూ ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారని, ఒకరి ఫొటోలు మరొకరు డిలీట్ చేసుకున్నారని చాలా రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమన్నా పెళ్లి పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.. ‘నేను 15 సంవత్సరాల వయసులో ముంబై నుంచి వచ్చినప్పుడు నాకు తెలియదు ఇంత పెద్ద ఇండస్ట్రీలో నన్ను ఇక్కడ నిలబడతారని. అయితే నేను చాలా కాన్ఫిడెన్స్‌తో వచ్చాను కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది ప్రాబ్లమే కాదు’ అని చెప్పింది. మరి మ్యారేజ్ ఎప్పుడు అని యాంకర్ అడుగగా.. ‘అసలు నా మైండ్‌లో ఆ ఆలోచన లేదు. ప్రజెంట్ నాకు దాని గురించి మాట్లాడటం, ఆలోచించడం ఇష్టం కూడా లేదు’ అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు విజయ్‌తో బ్రేకప్ వల్లనే ఇలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్నది కావొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story