- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamannaah Bhatia: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న తమన్నా.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో.. ఇలా మారిపోయిందేంటని నెటిజన్లు షాక్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia)కు పరిచయం అక్కర్లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘శ్రీ’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ‘హ్యాపిడేస్, తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే మలయాళంలోనూ పలు సినిమాల్లో నటించిన తమన్నా మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీని షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ఐటమ్ సాంగ్స్‌లోనూ చిందులేసి దుమ్మురేపుతోంది. గత ఏడాది ఏకంగా నాలుగు చిత్రాలతో వచ్చిన ఈ బామ వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఇటీవల ‘ఓదెల-2’(Odela-2) మూవీతో ఘన విజయం సాధించింది. అయితే తమన్నా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా నటుడు విజయ్ వర్మ(Vijay Verma)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తడంతో ఇటీవల బ్రేకప్ చెప్పుకుని విడిపోయినట్లు పలు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని తర్వాత ఈ జంట ఒకేచోట కనిపించి క్లారిటీ ఇచ్చారు. దీంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.
ఇక ఈ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో తమన్నాకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఇందులో తమన్నా చాలా బొద్దుగా కనిపించింది. ఫ్రంట్ బొజ్జ బ్యాక్‌తో లావుగా కనిపించడంతో అది చూసిన నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అయిందని అంటున్నారు. మరికొందరు ఇదేం లుక్‌రా నాయానా ఇలా మారిపోయిందేంటి అని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తమన్నా వీడియో హాట్ టాపిక్‌గా మారింది. అసలు అది తమన్నా దేనా లేక ఏఐతో క్రియేట్ చేసిందా? అనే అనుమానంలో అభిమానులు ఉన్నారు.






