- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamannaah Bhatia : స్టార్ హీరోల భార్యలకి భయపడిపోయిన తమన్నా..ఎందుకో ?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ల్లో హద్దులు లేకుండా బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. అయితే తమన్నా గతంలో స్టార్ హీరోల భార్యలకు భయపడిందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తమన్నా, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘ఊసరవెల్లి’ సినిమాతో నటించిన సంగతి తెలిసిందే. అప్పుడు లక్ష్మి ప్రణతి కూడా షూటింగ్స్‌కు వచ్చేదట. తమన్నా ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను చూసి లక్ష్మీ ప్రణతి చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యేదట. అంతేకాకుండా తమన్నా వైపు కోపంగా చూసేదట. దీంతో అది గమనించిన ఎన్టీఆర్, ఇంటికి వెళ్లాక ప్రణతికి అర్థమయ్యేలా చెప్పడంతో ఆమె పద్ధతి మార్చుకుందట. అలాగే ‘బద్రినాథ్’ లో అల్లు అర్జున్ సరసన మీల్కీ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. అప్పుడు కూడా ఈ అమ్మడుకి అలాంటి పరిస్థితే ఎదురైందట. స్నేహ రెడ్డి కూడా తమన్నాని అలాగే చూసేదట. ఇక ఆమె చూపుకి తమన్నా భయపడి షూటింగ్స్‌లో చాలా టేక్స్ తీసుకునేదట.






