- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముసలి హీరోలు వద్దు...కుర్రాళ్లే కావాలి... టాలీవుడ్ హీరోయిన్ సంచలనం !
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడెప్పు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడెప్పుడో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో (Happy Days ).. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మిల్కీ బ్యూటీ తమన్నా... ఆ తర్వాత అందిన అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ హీరోల అందరి సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ.
ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అయింది. ఈ మధ్య కాలంలో తన ప్రియుడు విజయ్ వర్మతో ( Vijay verma) కూడా కలిసి నటించింది. తాజాగా తెలుగులో ఓదెల 2 సినిమాలో ( Odela 2) నటించిన తమన్నా. ఓదెల సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో.. ఈ సినిమా పార్ట్ 2 వస్తోంది. ఈ పార్ట్ 2 లో తమన్నాదే కీ రోల్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ తమన్నా కూడా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది తమన్నా. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలపై ( Tollywood heros)... షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇకపైన తెలుగు సినిమాలు చేసేందుకు ఎక్కువ ఫోకస్ చేస్తానని పేర్కొంది. హీరో ఎవరు అనే దానికంటే.. కథను నమ్ముకొని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని కూడా చెప్పింది. అందుకే ఓదెల 2 ను ఒప్పుకున్నట్లు వెల్లడించింది. తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు అందరి సరసన సినిమాలు చేశాను.. ఇకపై కుర్ర హీరోలతో కూడా ఛాన్స్ వస్తే చేస్తానని చెప్పకనే చెప్పింది. ఇది ఇలా ఉండగా తమన్నా అలాగే విజయ్ వర్మ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు గత నెల రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.






