- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tamannaah Bhatia: 40 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయబోతున్న తమన్నా.. మైథలాజికల్ సినిమాలో కీ రోల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇక అన్ని పాత్రలో సంప్రదాయంగా నటించిన ఆమె ‘లస్ట్ స్టోరీస్-2’లో మరీ బోల్డ్‌గా నటించి అందరికీ షాకిచ్చింది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇటీవల ‘ఓదెల-2’(Odela-2) మూవీతో వచ్చిన ఆమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తెలుగు, హిందీ, సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. తాజాగా, తమన్నా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra)తో జతకట్టబోతున్నట్లు సమాచారం.
మూవీ మేకర్స్ కథ చెప్పడంతో మిల్కీ బ్యూటీ కూడా నటించేందుకు ఒప్పుకుని సంతకం చేసిందట. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు దీపక్ మిశ్రా(Deepak Mishra) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ‘వివాన్’(Vivan) పేరుతో రాబోతున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ పౌరాణిక-నాటకం, ఉత్తర భారతదేశానికి చెందిన జానపద కథలకు వ్యతిరేకంగా రూపొందించబడుతోంది. అయితే షూటింగ్ జూన్‌లో మొదలుకాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, మిల్కీ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నసంగతి తెలిసిందే. నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా కంగారు పడిపోయారు. కానీ ఈ జంట మాత్రం కలిసే ఉన్నారు. ఆ తర్వాత పలు ఈవెంట్లకు వెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
EXCLUSIVE: TAMANNAAH BHATIA JOINS SIDHARTH MALHOTRA IN VVAN!#TamannaahBhatia joins #SidharthMalhotra in #Vvan; Filming of this "Mytho-Drama" begins in June - Detailed Report! https://t.co/d7ZahRaPPN
— Himesh (@HimeshMankad) April 25, 2025






