- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamannaah Bhatia: రేపే ఓదెల 2 విడుదల.. నెట్టింట వైరల్ అవుతోన్న తమన్నా పోస్ట్
రేపు ఓదెల-2 థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: రేపు ఓదెల-2 థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది. ఈ మూవీ 2021లో విడుదలన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్లు, ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల ముందుకు మూవీపై భారీ హైప్ పెంచాయి.
ఈ సినిమాలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించింది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంపత్ నంది రచయితగా వ్యవహరిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట, ఎన్ సింహ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ నాగసాధువుగా కనిపించనుంది. అయితే రేపు ఈ చిత్రం థియేటర్లలో కి రానుంది.
కాగా ఈ క్రమంలో తమన్నా భాటియా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ మూవీ కోసం తమన్నా పాల్గొన్న ప్రమోషన్స్ వీడియోలు, ఫొటోలు, దేవలయాల్ని సందర్శించినవి.. పలు ఫొటోలు పంచుకుంది. ఈ పోస్ట్‌కు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘ఈ అందమైన రైడ్‌కు ఎప్పటికీ కృతజ్ఞతురాలిని’’ అని జోడించింది. ప్రస్తుతం తమన్నా భాటియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






