- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిల్క్ బ్యూటీ తమన్నా లేటెస్ట్ పోస్ట్.. లుకింగ్ హార్డ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ అనేక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈమె అద్భుతంగా నటించి.. జనాల్ని మెప్పించింది. ఇటీవలే ఈ హీరోయిన్ నటించిన ఓదెల -2 సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజరే జనాల్లో విపరీతమైన హైప్ పెంచాయి. ఇక సినిమా విడుదలయ్యాక ఓదెల 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.
ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాకు సంపత్ నంది రచయిగా వ్యవహరించారు. హెబ్బా పటేల్, వశిష్ట, ఎన్ సింహ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా నాగసాధువుగా కనిపించింది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ మిల్క్ బ్యూటీ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. స్టైలిష్ డ్రెస్ ధరించి.. స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు లుకింగ్ హార్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






