- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కింగ్’ సరసన చేరిన ఫేవరెట్ హీరోయిన్
అక్కినేని హీరో నాగార్జున్ కెరీర్‌లో మైలు రాయిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కింగ్ 100’. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ నటే దీనిపై క్లారిటీ ఇచ్చింది.

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగార్జున్ కెరీర్‌లో మైలు రాయిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కింగ్ 100’. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండానే చిత్రీకరణ జరిపించేస్తున్నారు టీమ్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ నటే దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఒక కుర్చీపై ‘కింగ్ 100’ క్లాప్ బోర్డ్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘కింగ్ 100లో జాయిన్ కావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’ అంటూ షేర్ చేసింది. అలాగే.. టీమ్ టబు, అన్నపూర్ణ స్టూడియోస్‌ను ట్యాగ్ చేస్తూ నాగార్జున పేరుతో హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. దీంతో ఈ సినిమాలో టబు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో పాటు.. ఇదే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కావడం కూడా విశేషం. కాగా.. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత మళ్లీ నాగార్జున, టబు కలయికలో ఇన్నేళ్లకు సినిమా రావడంతో ప్రేక్షకులతో పాటు, ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






