నిర్మాత కాదు.. హీరో ఆధారిత పరిశ్రమగా మారిపోయింది.. ఇండస్ట్రీపై డైరెక్టర్ హాట్ కామెంట్స్

by Chukka Sudharani |

నటుడిగా కమర్షియల్ చిత్రాలు చేసిన రవిబాబు.. ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్’.

నిర్మాత కాదు.. హీరో ఆధారిత పరిశ్రమగా మారిపోయింది.. ఇండస్ట్రీపై డైరెక్టర్ హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: నటుడిగా కమర్షియల్ చిత్రాలు చేసిన రవిబాబు.. ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రేజర్’. ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు నెట్టింట సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఇక మే 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన రవిబాబు వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సినీ ఇండస్ట్రీపై, నటులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఇప్పుడు నేను నటిస్తున్న చిత్రాల్లో అయితే నాకంటే పెద్దవాళ్లు, లేదా చిన్న వాళ్లు ఉంటారు. నా స్థాయి ఫిట్‌నెస్, శారీరక లక్షణాలు ఉండి, నాలాగా నటించగల నటుడు నాకు దొరకడం లేదు. దొరికిన 90 శాతం హీరోలు డూప్స్‌ను వాడుకుంటారు. నేను మాత్రం నిజంగానే చేస్తాను, అందుకే నేను హీరో పాత్ర చేస్తున్నాను’ అని తెలిపాడు.

అలాగే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు సినీ పరిశ్రమ తనను తాను చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ పరిశ్రమ మొత్తం విలువ సుమారు ₹2000 కోట్లు ఉండొచ్చు, కానీ అది ఈ దేశంలోని ఒక క్లాస్-1 కాంట్రాక్టర్ బిల్లుకు కూడా సరిపోదు’ అన్నారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుత స్థితి గురించి ఒక కఠినమైన వాస్తవాన్ని తెలుపుతూ.. ‘నిర్మాత ఆధారిత పరిశ్రమ నుంచి హీరో ఆధారిత పరిశ్రమగా.. మన పరిశ్రమ చాలా మారిపోయింది. ఒకప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు డైరెక్టర్, రైటర్స్‌తో ఆఫీస్‌లో కూర్చొని ఫిల్మ్ మేకింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యేవాడు.. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నుండి రైటర్స్ వరకు అందరూ హీరోలను పీల్చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Next Story