- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
taapsee: లైఫ్‌టైమ్ అలా చేయాలంటూ ప్రభాస్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఝుమ్మందినాదం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు చిత్రాల్లో అవకాశం దక్కించుకుని.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. వస్తాడు నా రాజు, వీర, దరువు, సాహసం, దరువు, గుండెల్లో గోదారి, దొంగాట,గేమ్ ఓవర్, అనబెల్ సేతుపతి, మిషన్ ఇంపాజిబుల్ వంటి తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచేసింది. హిందీలో పింక్, నామ్ షబానా, సూర్మ, దిల్ జంగ్లీ, మిషన్ మంగళ్, హసీనా దల్ రుబ, దొబారా వంటి సినిమాల్లో తన అద్భుతమైన ప్రదర్శనను చాటింది.
షారుఖ్ ఖాన్ సరసన ఢంకీ సినిమాలో కూడా అద్భుతంగా నటించి జనాల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా 2023 లో డిసెంబరు 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఢిపరెంట్‌గా స్టైలిష్‌గానున్న శారీ కట్టుకుని అదిరిపోయే ఫొటోలకు ఫోజులిచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంది. వీటికి ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘జీవితాంతం వెతుకు’ అంటూ జోడించింది. ప్రస్తుతం తాప్సీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






