- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Taapsee: నలుపు డ్రెస్సులో క్లాస్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్న హాట్ బ్యూటీ
Taapsee: నలుపు డ్రెస్సులో క్లాస్ లుక్‌తో నడుమందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తున్న తాప్సీ.

దిశ, సినిమా: సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సాధారణ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఇందులో తాప్సీ తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కినా, ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం రాలేదు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంలో తాప్సీ సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆమెకు కూడా గుర్తింపు పెరిగింది.
అయితే ఈ సినిమాను మినహాయిస్తే తెలుగులో పెద్దగా విజయాలు దక్కకపోవడంతో తాప్సీ హిందీ సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది. బాలీవుడ్‌లో మాత్రం తాప్సీకి మంచి అవకాశాలు దక్కాయి. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంది.
దాంతో అక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. తాజాగా ఈమె తన సోషల్ మీడియాలో కొన్ని స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోల్లో తాప్సీ బ్లాక్ కలర్ స్టైలిష్ లాంగ్ డ్రెస్ ధరించి, ఒక చేతిని టేబుల్‌పై పెట్టి మరో చేతిని పైకి ఎత్తి స్టైలిష్ పోజ్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ పిక్‌లో ఆమె కర్లీ హెయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ఫోటోల్లో తాప్సీ నడుము అందాలు ఫుల్‌గా హైలెట్ అవుతుండటంతో, ప్రస్తుతం ఈ బ్యూటీ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






