- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Taapsee: ప్రతీసారి క్షమించడం సరైనది కాదు.. సీక్వెల్‌కు సిద్ధమైన థ్రిల్లర్ మూవీ
హీరోయిన్ తాప్సీ (Taapsee) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బద్లా’ (Badla).

దిశ, సినిమా: హీరోయిన్ తాప్సీ (Taapsee) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బద్లా’ (Badla). మిస్టరీ అండ్ థ్రిల్లర్ (Mystery and thriller) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి సుజాయ్ ఘోష్ (Sujay Ghosh) దర్శకత్వం వహించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, అజూర్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 2019లో విడుదలైన ఈ సినిమా ‘ప్రతీసారి ప్రతీకారం తీర్చుకోవడం సరికాదు.. అలాగే ప్రతీసారి క్షమించడం కూడా సరైనది కాదు’ అంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
దీంతో ఆడియన్స్ (audience) ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఈగర్‌గా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ గుడ్ న్యూస్ (good news) అందిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం సీక్వెల్ (sequel)ను తెరకెక్కించే ఆలోచనల్లో ఉన్నట్లు ఇటీవల ప్రకటించారు చిత్ర బృందం. అంతే కాకుండా దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇవ్వనున్నట్లు తెలుస్తుండగా.. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్‌గా మారింది. కాగా.. ‘బద్లా’ చిత్రంలో తాప్సీతో పాటు అమితాబ్ బచ్చన్, అమ్రితా సింగ్, మానవ కౌల్ ప్రధాన పాత్రల్లో నటించారు.






