SYG: సంబరాల ఏటిగట్టు నుండి శ్రీకాంత్ ఫస్ట్ లుక్ విడుదల

by Pulgam srinivas |

శ్రీకాంత్ డిఫరెంట్ లుక్.. ‘సంబరాల ఏటిగట్టు’లో కీలక పాత్ర

SYG: సంబరాల ఏటిగట్టు నుండి శ్రీకాంత్ ఫస్ట్ లుక్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: సాయి దుర్గా తేజ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు (SYG) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి కనిపించనుండగా, ఈ సినిమాకు రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది.

అందులో శ్రీకాంత్ చిరిగిన బ్రిటిష్ యూనిఫామ్ ధరించి, గుబురు గడ్డం మరియు పొడవైన వెంట్రుకలతో అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. ఈ లుక్ చూస్తే ఈ చిత్రంలో ఆయన పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ కోసం మేకర్స్ దాదాపు రూ.20 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.




Next Story