స్పెషల్ పోస్టర్‌తో హోలీ శుభాకాంక్షలు తెలిపిన SYG మూవీ టీమ్.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-15 13:39:57  IST  )

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

స్పెషల్ పోస్టర్‌తో హోలీ శుభాకాంక్షలు తెలిపిన SYG మూవీ టీమ్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ‘రేయ్’(Rey), ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’(subramanyam For Sale), ‘సుప్రీమ్’(Supreme), ‘తిక్క’(Thikka), ‘విన్నర్’(Winner), ‘నక్షత్రం’(Nakshathran), ‘జవాన్’(Jawaan), ‘ఇంటిలిజెంట్’(Intelligent), ‘తేజ్ ఐ లవ్ యు’(Tej I Love You), ‘ప్రతి రోజూ పండగే’(Prati Roju Pandage), ‘చిత్రలహరి’(Chitralahari), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), ‘రిపబ్లిక్’(Republic), ‘విరూపాక్ష’(Virupaksha) వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.

ప్రస్తుతం రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది. అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉంటే.. నేడు హోలీ పండుగ సందర్భంగా సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు చిత్రబృదం అందరూ రంగులు పూసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. సంబరాల ఏటిగట్టు మూవీ నుంచి మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు అని తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Next Story