స్వైప్ చేసి ప్రజెంట్ నా మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి.. అల్లు అర్జున్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Gugulothu.Kavitha |

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన హన్షిక(Hanshika) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

స్వైప్ చేసి ప్రజెంట్ నా మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి.. అల్లు అర్జున్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన హన్షిక(Hanshika) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగులో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘దేశ ముదురు’(Desamuduru) సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో హన్సిక చాలా ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలా కందిరీగ(Kandireega), పవర్(Pawar), బిందాస్(Bindas), మస్కా(Maska), బిల్లా(Billa) లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది.

టాలీవుడ్‌లోనే కాకుండా ఈ అమ్మడు బాలీవుడ్‌(Bollywood)లో కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే తమిళం(Tamil)లో కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకుంది. అయితే, హన్షికకి అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ, ఎంచుకున్న సినిమాలు ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జ్‌‌గా వ్యవహరిస్తుంది.

అలా తెలుగులో ప్రసారమయ్యే డ్యాన్స్ షో అయినటువంటి ‘ఢీ’(Dhee) షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా హన్షిక తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో పొద్దు పొద్దున్నే లేచి కొన్ని ఫొటోస్ దిగింది.

వాటికి ‘ప్లీజ్ స్వైప్ చేయండి ప్రజెంట్ మూడ్ స్వింగ్స్ ఏంటో తెలుస్తోంది.. ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ జోడించింది. ఇక ఫొటోస్‌లో ఎక్కిరించినట్టుగా, బుంగమూతి పెట్టుకున్నట్టుగా, డల్‌గా ఉన్నట్టుగా, ఎక్జైటింగ్‌లో ఉన్నట్టుగా, సిగ్గు పడుతున్నట్టుగా ఉన్న ఫొటోస్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. హార్ట్ సింబల్ పెడుతూ రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు.

Next Story