ఆ తేదీన విడుదల కానున్న 'స్వయంభు'

by Pulgam srinivas |

'స్వయంభు' విడుదలకు మే 22 తేదీని లక్ష్యంగా పెట్టుకున్న మేకర్స్.

ఆ తేదీన విడుదల కానున్న స్వయంభు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం 'స్వయంభు' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనుండగా, భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి గతంలో పలు విడుదల తేదీలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యంతో సినిమా విడుదల పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన సగం సీజీ పనులు సంతృప్తికరంగా పూర్తయ్యాయని, ప్రస్తుతం రెండో సగానికి సంబంధించిన సీజీ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అవి కూడా మరికొన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మే 15వ తేదీ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగభాగం సీజీ పనులు పూర్తవడంతో, మూవీ టీమ్ ఓటీటీ డీల్ కోసం కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీ5, నెట్‌ఫ్లిక్స్ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story