- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Swayambhu: అప్పటివరకు రిలీజ్ డేట్‌పై నో క్లారిటీ?
ప్రస్తుతం స్వయంభు చిత్ర సీజీ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఆ అవుట్‌పుట్‌పై చిత్ర బృందం సంతృప్తి చెందితే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: యువ హీరో నిఖిల్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం స్వయంభులో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం గడిచినప్పటికీ విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన సీజీ (CG) పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ పనుల అవుట్‌పుట్‌పై చిత్ర బృందం పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తే వెంటనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రధానంగా గ్రాఫిక్స్ పనుల నాణ్యతపై ఆధారపడి ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే స్వయంభు చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.






