Swayambhu: సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు.. పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ అందుకున్న హీరోయిన్!

by Chukka Sudharani |

‘డేంజర్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కలర్ స్వాతి (Color Swati).. ‘స్వామిరారా, కార్తికేయ’ వంటి సినిమాలతో తన క్రేజ్‌ను పెంచుకుంది.

Swayambhu: సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు.. పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ అందుకున్న హీరోయిన్!
X

దిశ, సినిమా: ‘డేంజర్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కలర్ స్వాతి (Color Swati).. ‘స్వామిరారా, కార్తికేయ’ వంటి సినిమాలతో తన క్రేజ్‌ను పెంచుకుంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ (Second innings) స్టార్ట్ చేసి.. ప్రైవేట్ ఆల్భమ్స్‌ (Private Albums)లో నటిస్తూ మళ్లీ మంచి ఫామ్‌లోకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న ఈ హీరోయిన్‌కు తెలుగులో మాత్రం ఆఫర్లు రావడం లేదని టాక్. ఇలాంటి సమయంలో స్వాతి తెలుగులో ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో అవకాశం అందుకున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ పాన్ ఇండియా సినిమా మరేదో కాదు.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధర్థ్ (Nikhil Siddhartha) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘స్వయంభూ’ (Swayambhu).

సోషియో ఫాంటసీ (Socio fantasy) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మంగా ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నభా నటేష్ (Nabha Natesh), సంయుక్తా మీనన్ (Samyukta Menon) నటిస్తుండగా.. కీలకమైన ఓ మహిళా పాత్ర కూడా ఉందట. అయితే.. ఈ పాత్రకు మొదట కొత్త నటిని తీసుకోవాలని అనుకున్న చిత్ర బృందం ఫైనల్‌గా స్వాతిని ఈ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో స్వాతి పాత్ర ఓ ప్రత్యేకమైన ఎమోషనల్ ఎలిమెంట్‌ను అందించబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. నిఖిల్, స్వాతి జంటగా ‘కార్తికేయ’ సినిమాలో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా కార్తికేయ-2 కూడా తెరకెక్కించారు చిత్ర బృందం.

Next Story