- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
S.V. Krishna Reddy: అతను హీరో అయితే సినిమా చేయనంది.. నేను ఆమెతో ఒక్క మాటే అన్నాను
ఎస్. వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆలీ హీరో అని తెలిసేసరికి సౌందర్య సినిమా చేయనని అంది. దానితో ఇంద్రజను పెట్టి సినిమా చేసినట్లు ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఎస్. వి. కృష్ణారెడ్డి ఒకరు. ఈయన దర్శకత్వం వహించిన దాదాపు ప్రతి సినిమాకు ఈయనే సంగీతం అందించాడు. అందులోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కెరీర్ బిగినింగ్లో కేవలం దర్శకత్వం, సంగీతంపై దృష్టిపెట్టిన కృష్ణారెడ్డి ఆ తర్వాత నటనపై కూడా ఆసక్తి చూపించి అందులో కూడా సక్సెస్ అయ్యారు. ఈ దర్శకుడి కెరీర్ను మలుపు తిప్పిన సినిమాలలో యమలీల ముందు వరుసలో ఉంటుంది. ఆలీ, ఇంద్రజ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఆలీ, ఇంద్రజకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. కొంతకాలం క్రితం కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో యమలీల సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశాడు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ... యమలీల సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తయింది. దాంతో అందులో మహేష్ బాబు అయితే బాగుంటాడని నాకు అనిపించింది, వెంటనే కృష్ణ గారిని కలిసి కథ చెప్పి విషయం చెప్పాను. ఆయన ఇప్పుడే మహేష్ సినిమాల్లో నటించడు, ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు.
దానితో ఆలీ హీరోగా అయితే బాగుంటుందని అనుకున్నాను, ఆయనకు కథ చెబితే ఓకే అన్నాడు. ఆ తర్వాత హీరోయిన్గా సౌందర్యను తీసుకోవాలనుకున్నాను, ఆమెకు కథ చెప్పాను, ఓకే అంది. అంతా సెట్ అయ్యింది అనుకునే లోపు ఆలీ హీరో అని తెలియడంతో సౌందర్య నేను సినిమా చేయను, మీరు హీరో అయితే చేస్తాను అని అంది. కానీ నేను మాత్రం ఆ కథకు ఆలీ పర్ఫెక్ట్, నువ్వు సినిమా చేస్తే చెయ్యి లేకపోతే లేదు, నేను మాత్రం హీరోను మార్చను అనే విధంగా ఆమెకు సమాధానం చెప్పాను, ఆమె ఆ తర్వాత డ్రాప్ అయ్యింది. ఇంద్రజను హీరోయిన్గా తీసుకొని సినిమా చేశాను, ఆ మూవీ మంచి విజయం సాధించింది అని ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.






