SV-17 టైటిల్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న టీజర్.. సరికొత్త లుక్‌లో టాలీవుడ్ యంగ్ హీరో

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-28 15:59:54  IST  )

విభిన్నమైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree vishnu) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

SV-17 టైటిల్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న టీజర్.. సరికొత్త లుక్‌లో టాలీవుడ్ యంగ్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: విభిన్నమైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree vishnu) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తూ ఆయన తెలుగు ప్రేక్ష‌కులంద‌ర్నీ ఎంట‌ర్టైన్ చేస్తూ వ‌స్తున్నాడు. గ‌త కొన్ని సినిమాలుగా వ‌రుస స‌క్సెస్‌లు అందుకుంటూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ హీరో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. శ్రీ విష్ణు కెరీర్లో 17(SV 17)వ చిత్రంగా ఇది రూపొందుతోంది.

హుస్సేన్ షా కిర‌ణ్(Hussen Shah Kiran) ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ మూవీలో రెబా మోనికా జాన్(Reba Monica John) హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర‌వాణి(Keeravani) కొడుకు కాల భైర‌వ(Kala Bhairava) ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఇన్విస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తోన్న ఈ మూవీలో శ్రీ విష్ణు డిటెక్టివ్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు మేకోవ‌ర్ చాలా కొత్త‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌నున్న సంగతి తెలిసిందే. అయితే నేడు శ్రీ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఎస్‌వీ-17 టైటిల్‌తో పాటు టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఈ మూవీకి ‘మృత్యుంజయ’(Mrityunjaya) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు.

ఇక టైటిల్ టీజర్‌ను గమనించినట్లయితే.. గేమ్ ఓవర్ జై అనే డైలాగ్‌తో స్టార్ట్ అయి.. నేను అయిపోయిందని అనే వరకు అవ్వదు.. అవ్వదు అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో టైటిల్ రివీల్ అయింది. ఇక ఇందులో హీరో ఖైదీగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్ని ఆకట్టుకుని సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.

Next Story