లంగా, జాకెట్, ఓణి వేసుకున్న హీరో.. ఆ పార్ట్‌పై పచ్చబొట్టు.. ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |

శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సువర్ణ టెక్స్‌టైల్స్’. ప్రశాంత్ నామిని రచన దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది ఈ చిత్రం.

లంగా, జాకెట్, ఓణి వేసుకున్న హీరో.. ఆ పార్ట్‌పై పచ్చబొట్టు.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సువర్ణ టెక్స్‌టైల్స్’. ప్రశాంత్ నామిని రచన దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. రెండు షెడ్యూల్లలో షూటింగ్ కంప్లీట్ చేసి... ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత అనిల్ తెలిపారు. ఫస్ట్ లుక్‌కు యూత్ లో మంచి ఆదరణ లభిస్తోందని.. ఇందులో యువతకు నచ్చే కొంత అడల్ట్ కంటెంట్‌కు కామెడీని జోడించినట్లు చెప్పారు.

Next Story