- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
100 Crores : ‘ఆహా’లోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘100 క్రోర్స్’
గతేడాది, థియేటర్స్ లో విడుదలవ్వగా ఇప్పుడు, ఓటీటీలోకి వచ్చేసింది

దిశ, వెబ్ డెస్క్ : హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘100 క్రోర్స్’ ( 100 Crores ). SS స్టూడియోస్ బ్యానర్ పై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాణంలో విరాట్ చక్రవర్తి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. గతేడాది, సెప్టెంబర్ 20న ఈ మూవీ థియేటర్స్ లో విడుదలవ్వగా ఇప్పుడు, ఓటీటీలోకి వచ్చేసింది.
షోలు, సిరీస్ లతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్న ఆహా ఓటీటీలో ఈ " 100 క్రోర్స్ " ( 100 Crores ) నేడు రిలీజ్ అయింది. తెలుగు, డబ్బింగ్ మూవీస్ ను ఆహాలో విడుదల చేసిన హనుమాన్ మీడియా ద్వారా ఈ చిత్రన్ని విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ.. " 100 క్రోర్స్ ఒక యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహాలో రిలీజ్ అయ్యే ఈ మూవీ ఆడియెన్స్ ను అలరిస్తుంది. థియేటర్లలో ఈ మూవీ చూడని వారు ఓటీటీలో చూడండని" ఆయన మాటల్లో తెలిపారు. ఈ మూవీతో సాయి కార్తీక్ నిర్మాతగా మారడం విశేషం ఆర్బీఐ నుంచి వచ్చే 500 కోట్లు మిస్ అవ్వడం, అలాగే ఓ డబ్బున్న వ్యక్తి ఇంట్లో 100 కోట్లు మిస్ అవ్వడం, ఇంత డబ్బు ఎలా మిస్ అయింది ? అనే సస్పెన్స్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.






