- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాతి బరిలో శర్వానంద్ సినిమా.. కానీ ఓ బిగ్ ట్విస్ట్
చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకోగా.. ఈ చిత్రం సంక్రాంతి బరిలో రాబోతున్నట్లు ఇప్పటికే అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్‌పై కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నారి నారి నడుమ మురారి చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అనేది ఇప్పుడు పూర్తిగా దాని Ott ఒప్పందంపై ఆధారపడి ఉందట.
ఒప్పందం కుదిరితే ఈ చిత్రం అధికారికంగా పండుగ రేసుకు వస్తుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ చిత్రం ఓటీటీ డీల్ కంప్లీట్ కాకపోతే.. సంక్రాంతి రేసులో ఉండకపోవచ్చని సమాచారం. అయితే.. ఒప్పందం కుదిరేలోపు తుది కాపీ సిద్ధంగా ఉన్నందున మిగిలిన షూటింగ్‌ను వచ్చే వారం తిరిగి ప్రారంభించడానికి బృందం సన్నాహాలు చేస్తోందని టాలీవుడ్ వర్గాల నుంచి టాక్. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్‌పై ఏదో ఒక అప్డేట్ వస్తే కానీ ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతికి వస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. లింక్






