- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mumbai: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్
బాలీవుడ్(Bollywood) నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్(Bollywood) నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఛత్తీస్‌గఢ్ దుర్గ్‌లో శనివారం రైల్వే పోలీసులు(Mumbai Police) అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్(Jnaneshwar Express)లో చాలా చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మరోవైపు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. వెన్నెముకలో గుచ్చుకున్న కత్తిని తొలగించడానికి శస్త్రచికిత్స సైతం చేశారు.
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న నటుల్లో సైఫ్ అలీఖాన్ కూడా ఒకరు. దాడి ఘటనతో ప్రతి ఒక్కరూ షాకయ్యారు. ఆయన తిరిగి కోలుకోవాలని సహచర నటీనటులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ వివిధ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. దాదాపు ఐదారు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఎన్టీఆర్‌తో దేవర పార్ట్-2(Devara Part-2)తో పాటు ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా చిత్రంలో కూడా సైఫ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.






