- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య ‘రెట్రో’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటించగా.. రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది. అయితే ఇందులో నాజర్(Nazar), జోజూ జార్జ్, జయరామ్ వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. యాక్షన్‌తో పాటు ప్రేమ భావోద్వేగాలతో కూడిన ఈ సినిమాలో సూర్య గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. అయితే ‘రెట్రో’(Retro) చిత్రం మేడే సందర్భంగా థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే కేవలం 18 రోజుల్లోనే రూ. 235కోట్లు రాబట్టి రికార్డ్ సాధించింది. సూర్య కెరీర్‌లోనూ అత్యధిక కలెక్షన్స్ రాబట్టి చిత్రంగా మొదటి స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధం అయినట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో మే 31 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా సూర్య వైల్డ్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరికొందరు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు.






