- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయం సాధించాలని కోరుకుంటున్నా.. వారికి విషెస్ తెలుపుతూ సూర్య ఇంట్రెస్టింగ్ ట్వీట్.. గ్రేట్ అంటున్న నెటిజన్లు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో రాబోతున్న ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రాన్ని స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సంతోషం నారాయణ్, జయరామ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ‘రెట్రో’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.Karthik Subbaraj
అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, హీరో సూర్య ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘మే 1న మా రెట్రో సినిమాతో పాటు టూరిస్ట్ ఫ్యామిలీ, హిట్-3, రైడ్-2 రిలీజ్ కాబోతున్నాయి. ప్రియమైన శశి, సిమ్రాన్, నాని, అజయ్ సర్, రితేష్‌తో పాటు ఇతర టీమ్ సభ్యులకు సిబ్బందికి నా శుభాకాంక్షలు. రెట్రోపై అభిమానులు చూపుతున్న ప్రేమ మద్దతుకు కృతజ్ఞతలు. రిలీజయ్యే ప్రతి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మనమే హిట్ కొడతాం అన్నా.. నువ్వు చాలా గ్రేట్ అని కామెంట్లు పెడుతున్నారు.
Dearest Sasi & Simran, Nani, Ajay sir & Riteish, all the cast & crew of #TouristFamily #HIT3 #Raid2 Wishing you the bestest!#Anbannafans Lots of love and respect for your support for #Retro... May each of our films be a success & entertain the audience in theatres tomorrow.
— Suriya Sivakumar (@Suriya_offl) April 30, 2025






