- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Retro: రిలీజ్‌కు ముందే ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకున్న సూర్య మూవీ..
కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (Surya) నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’ (Retro).

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (Surya) నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’ (Retro). కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 2D ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింమ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ అంశాలతో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ చిత్రం సమ్మర్ (Summer) స్పెషల్‌గా మే 1న ప్రపంపవ్యాప్తంగా థియేటర్‌లలో రిలీజ్ కానుందని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ (OTT Patner)ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ‘రెట్రో’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (Digital streaming) హక్కులను సొంతం చేసుకోగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చింది. ‘మనిషి ప్రేమ పర్వతాలను కదిలిస్తుంది, కానీ అతని కోపం? అదే రెట్రో! రెట్రో సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత తమిళం (Tamil), తెలుగు (Telugu), మలయాళం (Malayalam) & కన్నడ (Kannada)లో నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతుంది!’ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.






