వాలెంటైన్స్ డే నాడు బ్యాండ్ మేళం నుంచి సర్‌ప్రైజ్.. లవర్స్‌కు ఇక పండగే

by I. Sairam |   (  Updated:2026-02-09 08:06:35  IST  )

టాలీవుడ్‌లో 2025లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న హిట్ చిత్రం ‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ద్వారా పరిచయమైన యువ జంట శ్రీదేవి(Sridevi) – రోషన్(Roshan) మరోసారి కలిసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడానికి సిద్ధమయిన సంగతి తెలిసిందే.

వాలెంటైన్స్ డే నాడు బ్యాండ్ మేళం నుంచి సర్‌ప్రైజ్.. లవర్స్‌కు ఇక పండగే
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో 2025లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న హిట్ చిత్రం ‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ద్వారా పరిచయమైన యువ జంట శ్రీదేవి(Sridevi) – రోషన్(Roshan) మరోసారి కలిసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడానికి సిద్ధమయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే తమ నటనతో ఆకట్టుకున్న ఈ జంట, ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకులను మళ్లీ మంత్రముగ్దులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్(Kona Venkat) నిర్మిస్తున్నారు.

“బ్యాండ్ మేళం”(Band Melam) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి స‌తీష్ జ‌వ్వాజీ(Sathish Javvaji) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ సినిమాకి చంద్ర‌బోస్ సంగీతం అందిస్తున్నారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ కూడా షేర్ చేశారు. ఇక ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కానున్నదట. షేర్ చేసిన పోస్టర్‌లో రోషన్ అండ్ శ్రీదేవి స్కూల్ యూనిఫార్మ్‌లో మొహానికి చేతులు అడ్డుపెట్టుకొని ఉన్నారు. ఇక పోస్టర్‌ను బట్టి చూస్తూ ఇది స్కూల్ డేస్‌లో వచ్చే సాంగ్‌లా అనిపిస్తుంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఫస్ట్ సింగిల్ రాబోతుంది.. రొమాంటిక్ ఫొటోస్‌తో అప్డేట్ ఇచ్చిన చెన్నై లవ్ స్టోరీ..

Next Story