జై భీమ్ డైరెక్టర్‌తో సూర్య నెక్ట్స్ మూవీ!

by Chukka Sudharani |

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ సూర్య.. ఇప్పుడు తన ‘సూర్య-47’ కోసం సిద్ధం అవుతున్నాడు.

జై భీమ్ డైరెక్టర్‌తో సూర్య నెక్ట్స్ మూవీ!
X

దిశ, సినిమా: ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ సూర్య.. ఇప్పుడు తన ‘సూర్య-47’ కోసం సిద్ధం అవుతున్నాడు. ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న ఇందులో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మాలవుడ్ యగ్ హీరో నస్లెస్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. సూర్య-48కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సూర్య తన తదుపరి ప్రాజెక్టు 48కోసం ‘జై భీమ్’ డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్‌తో మరోసారి చేతులు కలిపినట్లు టాక్. 2021లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రంలో సూర్య ప్రధాన పాత్రలో నటించి.. నిర్మించాడు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తో సూర్య తన తదుపరి చిత్రం ‘సూర్య-48’ను చేసేందుకు సిద్ధం అయ్యాడట. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుండగా.. 'జగరం స్టూడియోస్' నిర్మించే అవకాశం ఉన్నట్లు టాక్. అంతే కాకుండా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో.. హిట్ కాంబోతో మరో క్లాసిక్ హిట్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story