పవర్ ఫుల్‌లో సూర్య కరుప్పు తెలుగు టైటిల్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by Chukka Sudharani |

సూర్య, RJ బాలాజీ కాంబో ప్రాజెక్టు ‘కరుప్పు’ను తెలుగులో 'వీరభద్రుడు' అనే పవర్ ఫుల్ టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు.

పవర్ ఫుల్‌లో సూర్య కరుప్పు తెలుగు టైటిల్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కలయికలో వస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని ప్రమఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 14న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Next Story