Suriya: కింగ్‌డమ్‌కు డబ్బింగ్ చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది.. విజయ్ సినిమాపై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న లేటెస్ట మూవీ ‘రెట్రో’ (Retro).

Suriya: కింగ్‌డమ్‌కు డబ్బింగ్ చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది.. విజయ్ సినిమాపై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న లేటెస్ట మూవీ ‘రెట్రో’ (Retro). కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ సినిమాను స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘విజయ్ ‘కింగ్‌డమ్’ సినిమాకు తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పున్నాను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. విజయ్‌తో పాటు మూవీ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. మంచి సక్సెస్ అందుకోవాలి’ అని తెలిపారు.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాట్లాడుతూ.. ‘సూర్య అన్న నాకు చాలా ఇన్స్పిరేషన్. సూర్య అన్నా నడిపిస్తున్న అగరం ఫౌండేషన్ అంటే నాకు చాలా ఇష్టం. దీని ద్వారా వేలాదిమంది స్టూడెంట్స్‌కు ఫైనాన్షియల్‌గా నిలబడ్డారు. అలాగే వారి హైయర్ ఎడ్యూకేషన్ దగ్గర నుంచి జాబ్స్ వరకు అన్నీ చూసుకుంటున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇది నా ధర్మం.. ఇలా చేయడం నాకు ఇష్టం.. ఇదే నా లైఫ్ అని చెప్పారు సూర్య. ఆ మాటలకు నేను ఎంతో కనెక్ట్ అయ్యాయి.. ఈ ఇయర్ నేను కూడా స్టూడెంట్స్‌తో కమ్యునికేట్ అవ్వాలి అనుకుంటున్నా. వారికి సహాయంగా ఉండాలి అనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story