తోటి నటుడి కొడుకుకు బంగారు చైన్ వేసిన సూర్య.. క్యూట్ వీడియో వైరల్

by Sujitha Rachapalli |

సూర్య.. స్టార్ హీరోగానే కాదు మనసున్న మంచి మనిషిగా కూడా ప్రశంసలు అందుకున్నాడు.. అందుకుంటున్నాడు. తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుగా మలిచిన ఆయన.. భార్య జ్యోతిక కోసం ముంబైకు షిఫ్ట్ కావడంపై కూడా

తోటి నటుడి కొడుకుకు బంగారు చైన్ వేసిన సూర్య.. క్యూట్ వీడియో వైరల్
X

దిశ, సినిమా : సూర్య.. స్టార్ హీరోగానే కాదు మనసున్న మంచి మనిషిగా కూడా ప్రశంసలు అందుకున్నాడు.. అందుకుంటున్నాడు. తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుగా మలిచిన ఆయన.. భార్య జ్యోతిక కోసం ముంబైకు షిఫ్ట్ కావడంపై కూడా సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ పొందాడు. భర్త అంటే ఇలా అర్థం చేసుకోవాలని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని చాలా మంది ఆశించారు కూడా. ఇక తాజాగా తన లేటెస్ట్ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన తోటి నటుడు చరణ్ కొడుకుకు మంచి బహుమతి ఇచ్చి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్నారికి గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి.. అతన్ని ఎత్తుకుని లాలించిన వీడియో వైరల్ అవుతుండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత స్వీట్ గెశ్చర్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

Next Story