- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పోలీస్ గా కనిపించనున్న సూర్య.. ఆవేశం డైరెక్టర్ తో సాలిడ్ సినిమా
పోలీస్ స్టోరీస్ సినిమాలు అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమాల్లో సూర్య సింగం సిరీస్ సినిమాలు ముందుంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: పోలీస్ స్టోరీస్ సినిమాలు అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమాల్లో సూర్య సింగం సిరీస్ సినిమాలు ముందుంటాయి. తెలుగులో ఘర్షణ తర్వాత.. సింగం సిరీస్ కు ఆ స్థాయిలో క్రేజ్ వచ్చింది. కానీ సింగం 3 తర్వాత సూర్య పోలీస్ జానర్ సినిమా చేయలేదు. తాజాగా మళ్లీ సూర్య పోలీస్ అవతారంలోకి మారినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గానే ఆయన 47వ సినిమా మొదలుపెట్టగా.. అందులో పోలీస్ రోల్ లో కనిపిస్తారన్న టాక్ ఉంది. మలయాళంలో ఆవేశం తెరకెక్కించిన డైరెక్టర్ జిత్తు మాధవన్ సూర్య 47వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్యని ఒక బ్యాడ్ పోలీస్ గా ప్రజెంట్ చేయనున్నట్లుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇకపై సాలిడ్ ప్రోమో కట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని, ప్రస్తుతం అదే షూటింగ్ జరుగుతోందని, త్వరలోనే దానిని వదులుతారని తెలుస్తోంది. Suriya 47 వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ద్వారా సూర్య పోలీస్ గా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.






