Suriya-46 ఓటీటీ డీల్ పూర్తి.. భారీ ధరకు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

by Chukka Sudharani |

తమిళ స్టార్ సూర్య ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు.

Suriya-46 ఓటీటీ డీల్ పూర్తి.. భారీ ధరకు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
X

దిశ, సినిమా: తమిళ స్టార్ సూర్య ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘సూర్య-46’ ఒకటి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

సూర్య-46 మూవీ ఓటీటీ డీల్ భారీ ధరకు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా రూ. 80 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో మూవీపై హైప్ మరింత క్రియేట్ అవుతుంది. కాగా.. మలయాళ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తు్న్న ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. లింక్


Next Story