నిర్మాత మృతిపై స్పందించిన సురేఖావాణి కూతురు.. దయచేసి నా దగ్గరకు తిరిగి రండి అంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

నిర్మాత మృతిపై స్పందించిన సురేఖావాణి కూతురు.. దయచేసి నా దగ్గరకు తిరిగి రండి అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి(Krishna Prasad Chowdhury) (కేపీ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓ హోటల్ గదిలో విగతజీవిగా పడి ఉన్న ఆయనను చూసిన సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం కాస్త బయటపడింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కృష్ణ ప్రసాద్ మృతి గురించి తెలుసుకున్న సినీ సెలబ్రిటీలంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, టాలీవుడ్ నటి సురేఖావాణి(Surekhavani) కూతురు సుప్రీత(Supreeta) స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను. అన్న నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. నీ బాధలను నేను వినడానికి లేకుండా చేసావు కదా అన్న. నీకు ఈ చెల్లి ఎప్పుడూ ఉంటుందన్నా. దయచేసి నా దగ్గరకు వచ్చేయ్ అన్న, మిస్ యు కేపీ అన్న. నువ్వు ఎక్కడున్నా టైగర్ ఏ అంటావుగా, ఐ లవ్ యు సో మచ్ అన్న. రెస్ట్ ఇన్ పీస్’’ అని రాసుకొచ్చింది. అలాగే కేపీ చౌదరితో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం సుప్రిత్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన పలు బాధలను భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కన్ఫర్మ్ చేసింది.

Next Story