- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supritha : నేను పెళ్లి చేసుకోవాలంటే మా అమ్మ పెళ్లి జరగాల్సిందే
Supritha : నన్ను చాలా మంది పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ మా అమ్మకు పెళ్లి కాకుండా నేను చేసుకోను.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి దశలో కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో సురేఖ వాణి ఒకరు. ఈమె ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కూతురు సుప్రీత కూడా ఈ మధ్యకాలంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె అమరావతికి ఆహ్వానం అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి.
నటిగా ఇప్పుడిప్పుడే కెరీర్ను ప్రారంభిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన తల్లి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజాగా సుప్రీత మాట్లాడుతూ... "మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది. నన్ను చాలామంది పెళ్లి చేసుకో అని అంటున్నారు. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది.
కాకపోతే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అమ్మ ఒంటరిది అవుతుంది. అది నాకు నచ్చడం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకునే కంటే ముందే మా అమ్మకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అలా ఆమెకు పెళ్లి చేస్తే ఆమెకు ఒకరు తోడు ఉంటారు. దానితో నా అవసరం ఆమెకు ఉండదు. నేను కూడా ఆనందంగా ఉంటాను. మా బంధువులు కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు, కానీ ఆమెకు మాత్రం రెండవ పెళ్లి పెద్దగా ఇష్టం లేదు" అని సుప్రీత తాజాగా చెప్పుకొచ్చింది.






