- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suriya: ‘రెట్రో’ సినిమాకు సూపర్ స్టార్ రివ్యూ.. గాల్లో తేలిపోతున్నట్లు ఉందంటూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది. ఇటీవల ఆయన ‘రెట్రో’(Retro) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది. ఇటీవల ఆయన ‘రెట్రో’(Retro) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్స్‌లోకి వచ్చింది. కానీ హిట్ సాధించలేకపోయింది. తెలుగులో మరీ దారుణంగా ఉంది. హిట్-3 కూడా అదే రోజున విడుదల కావడంతో అంతా నాని చిత్రాన్ని చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం ఈ మూవీకి కేవలం 45 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయిని తెలుస్తోంది. సూర్య ఎంత కష్టపడినా ఫలితం మాత్రం రావడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ ‘రెట్రో’ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ చూసి సూర్యపై ప్రశంసలు కురిపించారు.
ఈ విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ ట్వీట్ చేశారు. ‘‘టీం అంతా కలిసి ఎంతో కష్టపడి.. అద్భుతమైన సినిమాను తీశారు.. సూర్య పర్ఫామెన్స్ అద్భుతం.. చివరి 40 నిమిషాలు సినిమా నెక్ట్స్ లెవెల్.. చివర్లో నవ్వే ఆ సీన్ ఫెంటాస్టిక్.. గాడ్ బ్లెస్ అని రజినీకాంత్ ఫోన్‌లో అభినందించాడట. ఇక రజినీ మాటలతో కార్తిక్ సుబ్బరాజ్‌కి గాల్లో తేలినట్టు అనిపిస్తోందని ఎమోజీలు షేర్ చేస్తూ థాంక్యూ తలైవా’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఆయన ఫొటో షేర్ చేస్తూ జానీ పారిపై ప్రశంసలు కురిపించాడు అనే పోస్టర్‌ను కూడా క్రియేట్ చేసి పెట్టాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రజినీకాంత్ చెప్పినట్లుగా అంత బాగుంటే బాక్సాఫీసు వద్ద ఎందుకు మెప్పించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






