పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ తుపాన్.. సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్

by Gantepaka Srikanth |

చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌(Rajinikanth)కు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ తుపాన్.. సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌(Rajinikanth)కు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రకటన విడుదల చేశారు. ‘వెండి తెరపై సూపర్ స్టార్ రజినీ అనే టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజినీకాంత్. నటుడిగా ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సందర్భంగా రజినీకాంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. ప్రతినాయక పాత్ర పోషించినా, కథానాయకుడిగా మెప్పించినా తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన స్టైల్స్‌కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజినీకాంత్.. మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ట్వీట్‌కు రజినీకాంత్ స్పందించారు. ఈ మేరకు ఆయన కూడా నెట్టింట ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా ప్రియమైన సోదరుడు మరియు రాజకీయ తూపాన్ పవన్ కల్యాణ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని ప్రార్థిస్తున్నాను’ అని రజినీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story